కబ్జా భయంలో కాకినాడ రూరల్ ప్రజలు!!.. అడ్డుకున్న స్ధానికులు, అండగా పంతం నానాజీ

కాకినాడ 2వ డివిజన్ పరిధి సౌజన్య నగర్ లో ప్రభుత్వ పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని కాలనీ వాసులు కాల్ చేయడంతో విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ అప్రాంతానికి వెళ్ళి ఇద్దరు వ్యక్తులను గమనించి పోలీస్ వారికీ కాల్ చెప్పి, తరువాత ఆ వ్యక్తులనుండి వివరాలు తెలుసుకుని, ఆ కాలనీ వాసులకి, మహిళలకి కంగారు పడవద్దని ముందుగా ఎస్పీ గారికి కంప్లైన్ట్ ఇద్దాం అని చెప్పి.. ఇది ప్రభుత్వ స్థలం అయినట్లయితే కబ్జా కాకుండా మీకు మేము జనసేన తరఫున అండగా ఉంటామని పంతం నానాజీ బాధితులకు బరోసా ఇచ్చారు.