కడపలో ఘనంగా సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు

కడప: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా కడప నగరంలోని ప్రకాష్ నగర్ లో ఉన్నా బీసీ హాస్టల్ లో చిన్నారులకు కడప మెగా అభిమాని అబ్నన్న గారి రాజ గోపాల్ ఆధ్వర్యంలో అల్పాహారం విందు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర జనసేన పార్టీ కార్యనిర్వాహణ కార్యదర్శి సురేష్ బాబు, కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పండ్రా రంజిత్ కుమార్ లు పాల్గొని వారి చేతుల మీదుగా అల్పాహారం విందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమాలు చేస్తూ సినీ ప్రేక్షకులను అలరించడమే కాకుండా పలు సామాజిక ఆర్థిక సేవా కార్యక్రమాలు చేస్తూ మేనమామలు చిరంజీవి పవన్ కళ్యాణ్ ల అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల మనలను పొందిన వ్యక్తి అటువంటి సాయిధరమ్ తేజ పుట్టినరోజు పురస్కరించుకొని కడప నియోజవర్గంలో ఈ చిన్నారుల మధ్యలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తి విస్సు, బోరెడ్డి నాగేంద్ర, స్వరూప్, మహేష్, శరత్ చంద్ర, పత్తి గౌతమ్, అక్భర్, నిఖీలేష్, ఉపేంద్ర, మనోహర్ తదితరుల్ పాల్గొన్నారు.