Sai Dharam Tej: కలెక్టర్‌గా రానున్న సాయితేజ్‌.. ‘రిపబ్లిక్‌’ విడుదల ఎప్పుడంటే?

సాయితేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్‌’. ఇందులో ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్‌గా నటించారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 1న విడుదల కానుంది. ఇందులో కలెక్టర్‌ పంజా అభిరామ్‌ పాత్రలో నటించారు సాయితేజ్‌. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు ముగిశాయి. ”ఆల్రెడీ విడులైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సాయితేజ్‌ యాక్టింగ్, దేవ కట్టా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌ ప్రేక్షకులను అలరిస్తాయి” అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

మరికొన్ని రోజులు హాస్పిటల్‌లోనే… ఇటీవల బైక్‌ యాక్సిడెంట్‌లో గాయపడ్డ సాయితేజ్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సాయితేజ్‌ ఆరోగ్య స్థితిపై శనివారం సాయంత్రం తాజా హెల్త్‌ బులిటెన్‌ విడుదలైంది. ”సాయితేజ్‌ స్పృహలోనే ఉన్నారు. వెంటిలేటర్‌ తొలగించడంతో సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారు. చికిత్స నిమిత్తం మరికొన్ని రోజులు హాస్పిటల్‌లోనే ఉంటారు” అని ఆస్పత్రివర్గాలు పేర్కొన్నాయి.