సాయిరాం సేవలు ప్రశంసనీయం!

*రక్తదాన అవగాహన మీద సైకిల్ యాత్ర చేస్తున్న సాయిరామ్ ని సత్కరించిన కొట్టే వెంకటేశ్వర్లు

రక్తదాన అవగాహనను ప్రజల్లో నింపే లక్ష్యంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గత 50 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తున్న సాయిరామ్ 1300 కిలోమీటర్లు పూర్తి చేసి ఉదయగిరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. శక్తి వృద్ధికి బాదంపప్పు, జీడిపప్పు అందించి అభినందనలు తెలిపారు. ప్రజల్లో రక్తదానం ప్రాధాన్యతపై చైతన్యం తీసుకువచ్చేందుకు వయసును లెక్కచేయకుండా నిస్వార్థంగా కొనసాగిస్తున్న సాయిరాం గారి సేవలు ప్రశంసనీయం అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించి, సాయిరామ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.

Share this content:

Post Comment