సజ్జల రామకృష్ణా రెడ్డి నోరు అదుపులో పెట్టుకో: కుప్పాల జ్యోతి

  • పులివెందులలో కనీసం సర్పంచ్ గా గెలవలేని నువ్వు ప్రభుత్వ సలహాదారు అవ్వడం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చేసుకున్న కర్మ

అనంతపురం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై నిరాధారోపణలు చేస్తున్న వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ మహిళా కో ఆర్డినేటర్ కుప్పాల జ్యోతి హెచ్చరించారు. పులివెందుల నియోజకవర్గంలోని సొంత గ్రామం ముసాల్ రెడ్డి పల్లిని అభివృద్ది చెయ్యలేని నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు ఎక్కడిది అని నిలదీశారు. సాధారణ న్యూస్ పేపర్ కంట్రిబ్యూటర్ గా పనిచేసిన నీకు గ్రానైట్ వ్యాపారం చెయ్యడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి. వైఎస్.వివేకానందరెడ్డి కేసులో నిజాలు అన్ని నీకు తెలుసు ఆ నిజాలు బయట చెప్పకుండా ఉండటానికి నువ్వు ఎన్ని కోట్లు డబ్బులు తీసుకున్నావు. రాయలసీమలో ఉన్న కాంట్రాక్టర్ల దగ్గర ఎక్కడెక్కడ ఎంత డబ్బులు తీసుకున్నావో చెప్పమంటావా. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు వైఎస్. జగన్ రెడ్డిని ప్రశ్నిస్తుంటే నువ్వు ప్రెస్ మీట్ ముఖ్యమంత్రిగా మాట్లాడటానికి ఎన్ని కోట్లు ప్యాకేజ్ తీసుకుంటున్నావో చెప్పు, నీ కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి టికెట్ కోసం వైఎస్. జగన్ రెడ్డికి ఎంత ప్యాకేజ్ ఇవ్వబోతున్నావో మీడియా పూర్వకంగా చెప్పు సజ్జల రామకృష్ణా రెడ్డి. పులివెందులలో కనీసం సర్పంచ్ గా గెలవలేని నువ్వు ప్రభుత్వ సలహాదారు అవ్వడం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చేసుకున్న కర్మ అని అన్నారు. అతి త్వరలో పులివెందులలో తెల్చుకుందాం అని సజ్జల రామకృష్ణా రెడ్డికి సవాల్ విసిరారు.