ప్రేమ‌కు చిహ్నం ‘సాకి వ‌ర‌ల్డ్’

స్టార్ హీరోయిన్ సమంత బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. సినిమాలతో పాటు ఇతర రంగాలపై కూడా ఫోకస్ చేస్తూ ఆల్‌ రౌండ్ ప్రతిభ చూపుతున్న సమంత తన కొత్త వ్యాపారాన్ని అందరికీ పరిచయం చేసింది. అంతేకాదు ఆ రంగంలో తనకున్న ఇంట్రెస్ట్, అభిరుచిపై స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

సినిమాలతో పాటు అభిరుచి ఉన్న స‌మంత తాజాగా ఫ్యాషన్ రంగంలో కొత్త వ్యాపారం స్టార్ట్ చేసింది. ‘సాకీ’ పేరుతో మహిళల ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తీసుకొస్తోంది సామ్. ఈ మేరకు అతిత్వరలో దీనిని ప్రారంభించబోతున్నట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

కొన్ని నెల‌లుగా సాకి వర‌ల్డ్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నాన‌ని చెప్పిన స‌మంత.. తన జర్నీలో ఫ్యాషన్‌పై తనకున్న ప్రేమ‌కు చిహ్నం ఈ ‘సాకి వ‌ర‌ల్డ్’ అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ”సాకీ ఫైనల్‌గా రెడీ అయింది. ఇది నా బిడ్డ లాంటిది. దీని కోసం ఎన్నో కలలు కన్నాను. నా జీవిత ప్రయాణంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న అంశమిది. ఇలా ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటున్నా. త్వరలోనే సాకి వర‌ల్డ్‌ ప్రారంభించబోతోన్నాం” అని తెలుపుతూ తన కాలేజీ రోజులను గుర్తుతెచ్చుకుంది సమంత.

మరోవైపు ఇటీవలే సమంత చిన్న పిల్లల కోసం ‘ఏకం’ ప్రీ స్కూల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సో.. అక్కినేని వారింట అడుగుపెట్టాక వినూత్న ఆలోచనలు చేస్తూ దూకుడుగా వెళ్తున్న సమంత ఇంకెన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తుందనేది చూడాలి మరి!.