సలార్ మొదలైంది.. బహుబలితో రాఖీ భాయ్..

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. సంక్రాంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ నటుడు యశ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూజా కార్యక్రమం అనంతరం ప్రభాస్‌-యశ్‌ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.