కారుమంచి కోటేశ్వరరావు ను అబినందించిన ఉప్పు వెంకటరత్తయ్య

గుంటూరు: రక్తదానం చేసి ప్రాణం కాపాడిన జనసైనికుడు కారుమంచి కోటేశ్వరరావు ను అబినందించిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య. మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన రాజుపాలెం గ్రామ కాపురస్తురాలు శ్రీమతి జలపాటి పద్మావతి కి అత్యవసరం గా ఆపరేషన్ చేయు నిమిత్తం బి పాజిటివ్ బ్లడ్ అవసరమైనది అని మిత్రులు ద్వారా తెలియగానే నేను రక్తం ఇస్తానని చెప్పి వారు పిలిచిన వేంటనే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ రక్తనిధి వార్దు 29 కి వచ్చి గుంటూరు పట్టణ జనసైనికుడు కారుమంచి కోటేశ్వరరావు రక్తదానం చేసినారు. ఆపదలో వున్న జనసైనికురాలు శ్రీమతి జలపాటి పద్మావతి కి సరిఅయిన టైం లో రక్తం ఇచ్చి ప్రాణం కాపాడిన కోటేశ్వరరావును జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య కలసి అభినందించారు.