మదనపల్లెలో “తల్లికి వందనం”

*కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ భాషా

మదనపల్లె, రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి చెందిన తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా, మదనపల్లె పట్టణంలోని జడ్పీ హైస్కూల్‌లో “తల్లికి వందనం” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో డి.ఈ.ఓ, డివైఈఓ, ఎం.ఈ.ఓ, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ భాషా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత, కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల పట్ల గౌరవభావం పెంపొందించడం, విద్యార్థుల్లో మనోబలాన్ని బలపరిచేలా చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది.

Share this content:

Post Comment