*మాట నిలబెట్టుకున్న ఎన్డీయే ప్రభుత్వం
ఒక్కో ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి “తల్లికి వందనం” సాయం అందిస్తూ లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఎన్డీయే ప్రభుత్వం పట్ల బ్రహ్మసముద్రం పంచాయతీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం ఒక్క విద్యార్థికే పరిమితం చేసిన ‘అమ్మఒడి’ పథకాన్ని నమ్మకంగా నడిపినట్లు చెప్పి మోసం చేసినప్పటికీ, ప్రస్తుత “ఏన్.డి.ఏ కూటమి” ప్రభుత్వం మాటకు కట్టుబడి, ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ సాయం అందచేస్తున్నది. ఈ సందర్భంగా బ్రహ్మసముద్రం పంచాయతీలో “తల్లికి వందనం” పథకం ప్రారంభమైన సందర్భంగా, పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మకి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు కె.ఆది, జనసేన మండల కన్వీనర్ మహేష్, డీలర్ రామంజినప్ప, జనసేన సిద్ధప్ప, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎం.హరీష్, ఉపాధ్యక్షులు ఈ.నాగేంద్ర, ఈ.నరసింహ, అంజినప్ప, చిన్నా, ఇ.బాలాజీ, సి.హెచ్.రమేష్ తదితర పంచాయతీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం మాట నిలబెట్టుకుంటే, ప్రజల ప్రేమ చరిత్రగా మిగులుతుంది.
Share this content:
Post Comment