ఆ బయోపిక్ కు ఓకే చెప్పిన సమంత

తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్న నటి సమంత. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలసి నటించిoది.  అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. పెళ్లి తర్వాత కాస్త గ్లామర్ పాత్రలు చేయడం తగ్గించిన సమంత ఎక్కువగా లేడీ సెంట్రిక్ సినిమాలే చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. అలా ఇప్పటికే మహానటి, యూ టర్న్, ఓ బేబీ వంటి లేడీ సెంట్రిక్ సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు మరో శక్తివంతమైన లేడీ రోల్ లో నటించనున్నట్టు చెబుతున్నారు.

ఆ మధ్య సింగీతం శ్రీనివాసరావు రూపొందించబోతున్న ప్రముఖ కర్నాటక సింగర్‌ బెంగుళూరు నాగరత్నమ్మ జీవితం ఆధారంగా రూపొందించే బయోపిక్‌ లో అనుష్కను టైటిల్ రోల్ కోసం అనుకున్నారని అన్నారు. కానీ అదే సమయంలో ఆమె ఒప్పుకోలేదు అందుకే ఈ ప్రాజెక్ట్ సమంత వద్దకు వెళ్లిందని టాక్ నడిచింది. అయితే ఎందుకో కానీ ఆ విషయం మీద ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ తాజాగా ఈ ప్రాజెక్టుకు సమంత ఓకే చెప్పేసిందని సమాచారం.