సమర శంఖారావం పోస్టర్ ఆవిష్కరించిన బత్తుల

రాజానగరం, కోరుకొండ మండలం, జనసేన పార్టీ కార్యాలయంలో సమర శంఖారావం పోస్టర్ ఆవిష్కరించిన కోరుకొండ మండలం జనసేన పార్టీ నాయకత్వం. పాదయాత్రలో మరో మైలురాయిని(300 వ రోజు) చేరుకున్న బత్తుల. “సమర శంఖారావం” భారీ బహిరంగ సభకు నియోజకవర్గం నలుమూలలా నుండి వేలాది “జన సునామీ”గా కదం తొక్కనున్న జనసేన-టిడిపి శ్రేణులు. రాజానగరం గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం. 30,000 వేలమందితో రాజానగరం గ్రామంలో భారీ బహిరంగ సభ (సమర శంఖారావం) వేలాది బైకులు, కార్లు, ట్రాక్టర్లతో కోరుకొండ నుండి రాజానగరం వరకు మహ బైక్ ర్యాలీ.

ఈ నెల 7వ తేదీన (ఆదివారం) రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, రాజానగరం గ్రామంలో “జనం కోసం జనసేన” “మహా పాదయాత్ర” 300 వ రోజు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని. ఈ ఆదివారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండీ వేలాది బైక్లు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లతో రాజానగరం గ్రామం వరకు మహ బైక్ ర్యాలీ. అనంతరం గ్రామంలో “జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం” 300 రోజు పాదయాత్ర రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ రథసారథి బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గ జనసేన పార్టీ మహిళా నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మిలచే 300వ రోజు “పాదయాత్ర”. అనంతరం గ్రామంలో నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసిన వేలాది జనసేన, టిడిపి శ్రేణులచే రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, ఈ అవినీతి, అరాచక ప్రభుత్వం గద్దె దింపే విధంగా, ఇరు పార్టీల శ్రేణులకు బత్తుల దశా దిశా నిర్దేశం చేయనున్న ఎన్నికల “సమర శంఖారావం” భారీ బహిరంగ సభ. అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా బత్తుల బలరామకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా, మునుపెన్నడూ చూడని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో భారీ జన సముద్రాన్ని తలపించే ఈ భారీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి జనసేన, టిడిపి శ్రేణులు సిద్ధమవ్వాలని విజ్ఞప్తి చేసారు.