విజయవాడ సిటీ బస్టాండ్ సెంటర్ జనసేన పార్టీ నాయకులు పెటేటి నాంచారయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఏన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో జనసైనికులు వేసవి కాలంలో మజ్జిగ, తాగునీరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో జనసేన నాయకులు వీర మహిళలు ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కె.ఎస్.ఎన్ మూర్తి, వీరమహిళ నాయకురాలు తిరుపతి అనూష గొల్లపూడి జానసేన పార్టీ అధ్యక్షులు ధర్మారావుగారు, పులశేట్టి శివ, ఆటో యూనియన్ నాయకులు గగన్, నూకరాజు, అప్పన్నతో పాటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment