- మెగా రక్తదాన శిబిరం ప్రారంభం.
- భారీ సంఖ్యలో పాల్గొని స్వచ్చందంగా రక్తదానం చేసిన మెగా పవర్ స్టార్ అభిమానులు.
తిరువూరు పట్టణం ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు అఖిల భారత, చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితులు వేమూరి చంటి నేతృత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, తిరువూరు శాసన సభ్యులు కొలికపుడి శ్రీనివాసరావు హాజరయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకను పురస్కరించుకొని కేక్ కట్ చేసిన, అనంతరం మెగా రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు, మెగా అభిమానులు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల జన్మదిన వేడుకల సందర్భంగా వేమూరి చంటి సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు నిర్వహించడంపై వారు హర్షం వ్యక్తంచేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు వారి జన్మదినం ఒక పండుగల జరుపుకోవడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం మంచిపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత నిర్వాహకులు కృష్ణ ప్రసాద్, శ్యాం ప్రసాద్, కృష్ణ ప్రసాద్, జనసేన పార్టీ ఇంచార్జ్ చలమల శెట్టి రమేష్, డా.తాళ్లూరి రామకోటేశ్వరరావు, డా.తాళ్లూరి రామారావు, విజయవాడ జనసేన నాయకులు డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ, బిజేపి నాయకులు నంబూరి శ్రీనివాస్, కృష్ణ ప్రసాద్, రామ్ ప్రసాద్, న్యాయవాది లింగినేని సుధాకర్, రవీంద్ర, గాదెగుడెం సర్పంచ్ చెన్న శ్రీనివాస్, వెల్ ఫిట్ సత్యనారాయణ, నల్లూరి శ్రీనివాసరావు, జొన్నాడ రంగారావు, టి.రామకోటేశ్వరరావు, అడపా శ్రీను, వెంకట కృష్ణ, తోట రామకృష్ణ, పల్లెలపాటి రవి, రంగా నాగేంద్ర బాబు, ఆర్. సత్యనారాయణ, గుదే అన్వేష్, గోపిశెట్టి తులసి ప్రసాద్ మెగా అభిమానులు, స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment