విజయవాడ రూరల్ మండలం, పి.నైనవరం గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నేత పుచ్చకాయల నాగరాజు, మండల సంయుక్త కార్యదర్శి షేక్ రిజ్వాన్ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు హాజరయ్యారు. ముస్లిం ఉపవాస దీక్ష పరులతో కలిసి నమాజ్ చేసిన అనంతరం ఇఫ్తార్ విందు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ రంజాన్ అంటేనే ఒక నియమ నిష్టలతో కూడుకున్న పండుగని, నిబద్ధతతో ఎలా జీవనం సాగించాలో చాటిచెప్పే ఓ వేడుక అన్నారు. అలాంటి పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు పఠిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం, అల్లాహ్ ను ఆరాధించడం సమాజానికి మంచి సందేశమన్నారు. శాంతి సౌభ్రాతృత్వంతో కలిసి మెలిసి ఉంటేనే జీవన సాఫల్యతకు నిజమైన నిర్వచమని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ శాంతి సామరస్యంతో మెలగాలని, కులమతాలకు అతీతంగా పండుగలను అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏ.పి.ఐ.ఐ.సి డైరెక్టర్ మండలి రాజేష్, విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు పొదిలి దుర్గారావు, ఉమ్మడి జిల్లా సెక్రెటరీ బండ్రెడ్డి రవి, డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ, మండల ఉపాధ్యక్షులు పసుపులేటి భాస్కర్, పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి శివశంకర్, కొండవీటి ఈశ్వర్ రావు, జితేంద్ర, నైనవరం గ్రామ అధ్యక్షులు సిరిపరపు కృష్ణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు పురంశెట్టి నరసింహారావు, అన్నంశెట్టి నాగరాజు, చప్పిడి నాగేశ్వరరావు, గుర్రం మురళీకృష్ణ, వీర మహిళలు మేకల స్వాతి, సాగనబోయిన సుభాషిణి, పెంకల సుకన్య తదితరులు గ్రామ పార్టీ నాయకులతోపాటు గ్రామ ప్రజలు ముస్లిం మైనార్టీ నాయకులు మత గురువులు, మత పెద్దలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment