పవన్ రిప్లైతో సంపూర్ణేష్ బాబు ఆనందానికి అవధులు లేవు

నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా  మెగా అభిమానులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అయనకి శుభాకాంక్షలు అందజేశారు. అందులో భాగంగానే సినీ హీరో సంపూర్ణేష్ బాబు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “జన హృదయ నేత, జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు” అంటూ సంపూ ట్వీట్ చేశారు.

అయితే తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ .. అందులో భాగంగానే సంపూర్ణేష్ బాబు ట్వీట్ కి స్పందించిన పవన్.. ” థాంక్స్ డియర్ సంపూర్ణేష్ బాబు గారూ” అని రీ ట్విట్ చేయడంతో సంపూ ఆనందానికి అవధులు లేవు… ” అన్నా, మీ దగ్గర నుంచి ఈ రిప్లై రావటం , ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటాను, ఎంత సంతోషంగా ఉందొ మాటల్లో చెప్పలేను” అంటూ ట్వీట్ చేశాడు సంపూ…