బుధవారం, జరిగిన సమావేశం లో గోస్థనీనది నుంచి ఇసుకరవాణా, అధికధరలపై చర్చ నడిసింది. అనంతగిరి మండల గిరిజన ప్రాంతానికి భారీ ధరలతో ఇసుక సరఫరా చేస్తున్నారని, గిరిజన ప్రాంత వినియోదారులపై తీవ్ర ఆర్థికభారం పడుతుందని, జనసేన మండల అధ్యక్షులు చిట్టం మురళి కూటమి నాయకులతో కలసి స్థానిక తహశీల్దార్ కి ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుకు స్పందించిన తహసిల్దార్ మాణిక్యం బుధవారం తహసిల్దార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వాహన ఓనర్లకు పలు సూచనలు చేసారు. గిరిజన ప్రాంతాలకు తరలించే ఇసుక ధరలను తక్షణమే తగ్గించాలని, ఆదేశించారు. ఇసుక ధరల భారం కారణంగా గిరిజన వినియోదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇసుక రవాణా ఓనర్లు స్పందిస్తూ, గిరిజనప్రాంతంలో ఆయా ప్రాంతాలకు సంబంధించి,ధరలు తగ్గించి, ఇసుక సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్‌పిటిసి గంగరాజు కూటమి నాయకులు రంజిత్, భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రామకృష్ణ, ఆదివాసీ జేఏసీ నాయకులు రవీంద్ర, సీపిఎం నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Share this content:
Post Comment