కరోనాతో చనిపోయినవారి పిల్లలకు అండగా సందీప్ కిషన్

కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ మహమ్మారి కారణంగా చనిపోయిన వారి పిల్లలు అనాధలుగా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఒకరికి ఒకరం చేయూతగా ఉండడం చాలా ముఖ్యం. సినీ సెలబ్రిటీలు తమ వంతు బాధ్యతగా ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ఇంజక్షన్ల సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ.. కరోనాతో బాధపడుతున్న వారికి అండగా నిలబడుతున్నారు. యువ హీరో సందీప్ కిషన్ తాను అనాథ పిల్లలకు అండగానుంటానని ట్వీట్ చేసి అందరి మనసులు గెలుచుకున్నారు.

కరోనా కారణంగా తమ తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల బాధ్యతను తాను తీసుకుంటానని అన్నాడు సందీప్ కిషన్. మీ చుట్టుపక్కల తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు ఉంటే వారి వివరాలను sundeepkishancovidhelp@gmail.com కు తెలియజేయండి. కష్టకాలంలో కోవిడ్ కారణంగా చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలితే వారి బాధ్యతలను నేను, నా టీమ్ చూసుకుంటాం. రెండు సంవత్సరాల పాటు వారికి కావలసిన తిండి, చదవు, ఇతర అవసరాలన్ని సమకూర్చుతాం. ఇలాంటి సమయంలో ఒకిరికి ఒకరం అండగా నిలబడాలి. ఇంటి దగ్గరే ఉండి, క్షేమంగా మీ ప్రాణాలను కాపాడుకోండి. కుదిరితే కొంత సాయం చేయండి అని సందీప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.