వాలెంటీర్స్ సంఘ నాయకుడు సందీప్ రాందాస్ చౌదరి ఫైర్

మదనపల్లి కమ్మవీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ జూలై నెలలో వారహి యాత్రలో వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో ప్రతి 50 కుటుంబాలకు వాలెంటీర్స్ సేకరిస్తున్న వ్యక్తిగత డేటా మండల అధికారి దగ్గరో, కలెక్టర్ దగ్గరో ఉంటే మాకు ఏ అభ్యంతరం లేదు. వాలెంటీర్స్ అనే వాళ్ళు ప్రభుత్వం సొమ్ము తీసుకొని పనిచేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అబ్బ సోమ్మో, వైసీపీ మంత్రి, ఎంపీ, ఏమ్మెల్యేల డబ్బులు ఇవ్వడం లేదు. ప్రజా ధనాన్ని ప్రజలు టాక్స్ లు కట్టే ధనాన్ని వాలంటీర్ లకు ఇస్తా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ కలెక్ట్ చేసే డేటా అంతా కూడ హైదరాబాద్ లో ఉండే ఒక ప్రవేట్ సాఫ్ట్ వేర్ కంపెనీ సర్వర్ లో ఉంది. ఇదే విషయాన్ని మా నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాలు అందరి కంటే ముందుగా నిర్దిష్టమైన సమాచారం తీసుకొని వెలుగులోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా అందరి వాలంటీర్ ల పైన కాకుండా కొంతమంది వాలంటీర్లపైన సంఘ విద్రోహుల వాలంటీర్లపైన, ఒంటరి మహిళల పైన దాడి చేసే, ముసలి ముతక కళ్ళు కనిపించని వాళ్ళ దగ్గర వేలిముద్రలు వేయించుకొని పెన్షన్ ఇవ్వని వారి పైన, అక్రమ మద్యం చేసే వాలెంటీర్స్ పైన వ్యాఖ్యలు చేస్తే, దాన్ని పట్టుకొని ఈ వైసీపీ పేటీయం బ్యాచ్, వైసీపీ డాగ్స్ కొంత మంది పనికి మాలిన వాలంటీర్ లను, కొంతమంది వెధవ వాలెంటీర్స్ ను వెనుకేసుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను కాల్చి రాద్దాంతం చేయడం జరిగింది. వాలంటీర్ సంఘం నాయకుడు దాసరి సందీప్ కుమార్ అంగళ్ళు గ్రామానికి చెందిన ఇతను పవన్ కళ్యాణ్ అంతు చూస్తా, ఈ కార్యక్రమాన్ని ఉదృతం చేస్తా అన్న ఇతని వెనుక ఉన్న పెద్ద పెద్ద నాయకులు అంతా కలసి చేసిన పని వైసీపీ ఎంపీ, ఏమ్మెల్యే నవాజ్ బాషా, ద్వారకానాథ్ రెడ్డి కానీ వీళ్లంతా వైసీపీ నాయకులు వీళ్లను ముందర పెట్టి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర, అంగళ్ళు కూడలిలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను కాల్చడం జరిగింది. వాలెంటీర్స్ సంఘము నాయకుడు సందీప్ ఆయనకు తోడుగా అమ్మాజీ అనే అమ్మాయి కర్ణాటక మద్యం కేసులో అరెస్ట్ అవడం జరిగింది. వీళ్లకు కొంచెం అన్న సిగ్గు ఉండాలి అని తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి వారి పైన పవన్ కళ్యాణ్ మాట్లాడితే స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు మాట్లాడటం జరిగింది. వైసీపీ నాయకులకు ఒకటే సవాల్ విసురుతున్న ఇలాంటి సంఘటనలు జరిగే వాటికీ మీరు ఏం సమాధానం చెపుతారు అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఆర్కే రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళాంత సిగ్గుతో తలదించుకొని పవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్పే రోజులు దగ్గర పడ్డాయాని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, మదనపల్లి రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, అర్జున, చంద్రశేఖర, లవన్న, నవాజ్, నాగవేణి, యం.రమణ, నారాయణ స్వామి, ఆదినారాయణ తదితురులు పాల్గొన్నారు.