ఎస్పీ అజ్మీని మర్యాదపూర్వకంగా కలిసిన సందు పవన్

గుడివాడ: కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అద్నాన్ నయూమ్ అజ్మీ ని జనసేన నాయకులు సందు పవన్ ఆయన ఛాంబర్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. మొదటి సారి కలసినప్పటికీ ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్న తీరు మమ్మల్ని ఆశ్చర్య పరిచింది. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అజ్మీకి పుష్పగుచ్చం అందచేసి అభినందనలు తెలియజేయడం జరిగింది. జిల్లా పోలీస్ బాస్ గా తనవంతు సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ అందిస్తామని ఆయన హామీ ఇవ్వడం కొండంత బలాన్నిచ్చింది. అని అదే విధంగా జిల్లాలో అన్యాయాన్ని గురవుతున్న ఆడబిడ్డలకు మహిళా చట్టాలతో కాకుండా చట్టపరమైన శిక్షలు విధించాలని గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకులు సందు పవన్ కోరడమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తూము వెంకటరత్నం, నోబుల్ నాయుడు, నాగదాసి నవీన్ కుమార్, కాట్రు వంశీ, గుడివాడ సాయి, పాల్గొన్నారు.