‘సాని కాయిదం’ ఫస్ట్‌లుక్‌

కీర్తీ సురేశ్‌, దర్శకుడు సెల్వ రాఘవన్‌ నటీనటులుగా, అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వం లోరూపొందుతున్న తమిళ చిత్రం ‘సాని కాయిదం’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆదివారం ధనుష్‌ విడుదల చేశారు. ”సాని కాయిదం నుంచి మోస్ట్‌ వాంటెడ్‌ పీపుల్‌ను పరిచయం చేస్తున్నా” అని ఆయన పేర్కొన్నారు. ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల దగ్గరైన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్‌ సరసన కీర్తీ సురేశ్‌ నటిస్తుండటం ఈ సినిమా ప్రత్యేకత.