అంబేద్కర్ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశాఖపట్నం నగరంలోని 85వ వార్డు, గొన్నవానిపాలెంలో జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని గొన్న రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించగా, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అసమానతలు మరియు అస్పృశ్యతను నిర్మూలించేందుకు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లపు శ్రీను, గొన్న బొర్రయ్య, సిరపనశెట్టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment