సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరిన సంజయ్‌ దత్‌

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ సోమవారం లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఛాతీ, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరగా… రెండు రోజులపాటు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. చికిత్స అనంతరం జనరల్‌ వార్డుకు షిఫ్ట్‌ చేసి అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత.. పూర్తిగా కోలుకున్న సంజయ్‌ దత్‌ సంపూర్ణ ఆరోగ్యంతో సోమవారం ఇంటికి చేరుకున్నారు.