ఏకేయూ వీసిని కలిసిన సంజయ్ కుమార్

*ఏ.కే.యూ పరిధిలో ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాలపై పర్యవేక్షణ చేసిన వైనం

నూతనంగా ఏర్పడిన ఆంధ్ర కేసరి యూనివర్సిటీ నందు ఎన్.ఎస్.ఎస్ (జాతీయ సేవా పధకం) యూనిట్ల పనితీరును స్వయంగా పర్యవేక్షణ చేసేందుకు ఒంగోలు వచ్చిన ఎన్.ఎస్.ఎస్ రీజినల్ డైరెక్టరేట్ ప్రతినిధి ఎన్.సంజయ్ కుమార్ శనివారం ఏ.కే.యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్. మూర్తిని మర్యాద పూర్వకంగా కలుసు కున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన ఎన్.ఎస్.ఎస్ యూనిట్ల పనితీరు, నిధుల కేటాయింపు, దత్తత తీసుకున్న గ్రామాలలో విద్యార్థులు, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు చేపడుతున్న కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం నూతనంగా ఏర్పడిన యూనివర్సిటీ అయినప్పటికీ ఎన్.ఎస్.ఎస్ యూనిట్ల పనితీరు ఆశాజానకంగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్ర కేసరి యూనివర్సిటీ నందు ప్రస్తుతం ఉన్న యూనిట్లకు ఆధనంగా మరో 75యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు ఆయన విసి ప్రొఫెసర్ మూర్తికి తెలియ జేశారు. అనంతరం సంజయ్ కుమార్ ను వీసి ప్రొఫెసర్ మూర్తి శాలువాతో ఘనంగా సన్మానించారు. అంతకు ముందు సంజయ్ కుమార్ ఆంధ్ర కేసరి యూనివర్సిటీ లో ఉన్న స్థానిక ఎన్.ఎస్.ఎస్.కో ఆర్డినేటర్ కార్యాలయాన్ని సందర్శించి స్థానిక కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ తో మాట్లాడారు. ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలో ఎన్.ఎస్.ఎస్ యూనిట్ల పనితీరు, విద్యార్థులు చేపడుతున్న కార్యక్రమాలు, ప్రత్యేక క్యాంపులు, నిధుల వినియోగం తదితర అంశాల గురించి వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఎన్.ఎస్.ఎస్ యూనిట్లు పని చేస్తున్న తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సంజయ్ కుమార్ ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ ను హృదయ పూర్వకంగా అభినందించారు.

Share this content:

Post Comment