రాజంపేట జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

  • నందలూరులో రాజంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి పరిగిశెట్టి కీర్తన సహకారంతో సంక్రాంతి సంబరాలు
  • అలరించిన రంగవల్లలు పోటీలు

రాజంపేట: మన ఊరు మన ఆట మహిళల సంక్రాంతి సంబరాలను శనివారం నందలూరులో రంగవల్లల పోటీలను రాష్ట్ర జనసేన పార్టీ అధికారి ప్రతినిధి శ్రీమతి పరిగిశెట్టి కీర్తన సహకారంతో, నందలూరు మండల జనసేన పార్టీ నాయకులు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పోటీలో భారి ఎత్తున‌ స్థానిక మహిళలలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందలూరు మండల సౌమ్యనాధ స్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన పోటీలలో పలువురు వీర మహిళలు వేసి రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం గెలుపొందిన వీరమహిళలకు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా గెలిచిన పసుపులేటి భారతికి గ్రైడంర్‌, స్వప్న గారికి రెండవ బహుతిగా మిక్సి, స్వీటి మూడవ బహుమతిగా గ్యాస్‌ స్టౌవ్‌, 4, 5, 6 స్థానలలో నిలిచిన వాలకు బహుమతులు ఇవ్వడం జరిగింది.అలాగే ఈ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, పలువురు ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.