సోనూసూద్‌ ఫౌండేషన్‌కు సారా విరాళం

దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న వేళ సాయం చేసేందుకు బాలీవుడ్‌తో పాటు ఇతర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. సేవా కార్యక్రమాల్లో నటుడు సోనూసూద్‌ అందరికంటే ముందుంటున్నారు. తన ఆస్తులు తాకట్టు పెట్టీ మరి అడిగిన వారికి సాయమందిస్తున్నారు. కాగా యువ నటీమణి, సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌.. సోనూసూద్‌కు మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని సోనూసూద్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించి సారాకు ధన్యవాదాలు తెలిపారు. ‘సోనూసూద్‌ ఫౌండేషన్‌కు విరాళం అందించిన సారా అలీఖాన్‌ను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాంటి మంచి పనులు కొనసాగించు. యువతకు నువ్వు ఆదర్శంగా నిలిచావు’ అని ప్రశంసించారు.