‘సర్కారి వారి పాట’ మొదలైంది..

సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో వీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ప్రెస్టీజియస్‌ మూవీ ‘సర్కారువారి పాట’. ఈ సినిమా శనివారం ఉదయం 11 గంటల 43 నిమిషాలకు హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలోని కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ కెమెరా స్విఛాన్ చేయగా..కూతురు సితార ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టింది. నిర్మాతలు స్క్రిప్ట్‌ను దర్శకుడు పరుశురాంకు అందించారు. ఈ కాంబినేషన్‌పై ప్రేకక్షాభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటివారం నుండి ప్రారంభమవుతుంది. కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2021 జనవరి మొదటివారంలో షురూ కానుంది.