రోడ్డు పనులు పరిశీలించిన సర్పంచ్ కొండగొర్రి మంగ

పాలకొండ నియోజకవర్గం, మంగళవారం, మణిగ పంచాయతీ లివిరి జంక్షన్ ఏబి రోడ్డు నుండి ములగూడ గ్రామము వరకు రోడ్డు పనులు సర్పంచ్ కొండగొర్రి మంగ పరిశీలించి, రోడ్డు నాణ్యత గూర్చి అడిగి తెలుసుకుని, గ్రామినాభివృద్ది శాఖ మాత్యులు డిప్యూటీ సి.ఎం పవన్ కళ్యాణ్, సి.ఎం చంద్రబాబు నాయుడు మరియు స్థానిక ఎమ్మెల్యే జయకృష్ణ ఆదేశాల మేరకు నాణ్యత విషయంలో రాజీపడకుండా మంచి రోడ్డు వేయాలని కాంట్రాక్టర్ సాంబమూర్తి గారికి సర్పంచ్ మంగ గారు ఆదేశించడం జరిగింది. రోడ్డు పనులు నాణ్యత లేకుంటే పై అధికారులకు పిర్యాదు చేస్తామని హెచ్చరించడం జరిగింది. పంచాయతీ కార్యదర్శి చిన్నబాబు, మణిగ పంచాయతీ జనసేన అధ్యక్షులు చంటి మరియు కాంట్రాక్టర్ సాంబమూర్తి తదితరులు పాల్గొనడం జరిగింది.

Share this content:

Post Comment