తాగునీటి సమస్యలను పటించుకోని సర్పంచ్ తాటిపర్తి వనజ

  • గోపాల్ నగర్ లో తాగునీటి సమస్యపై ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను ఎంపీడీవో దృష్టికి తీసుకొని వెళ్లిన జనసేన నాయకులు

కొండేపి నియోజకవర్గం: గోపాల్ నగర్ లో తాగునీటి సమస్యపై ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను జనసేన నాయకులు ఎంపీడీవో దృష్టికి తీసుకొని వెళ్ళారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరాయకొండ గ్రామపంచాయతీ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం నెలలో రెండు మూడు రోజులు మాత్రమే సర్పంచ్ అనుకూలమైన ప్రదేశాలలో పర్యటించి, సింగరాయకొండ గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాను అని చెప్పి పత్రికలకే పరిమితమైన సింగరాయకొండ గ్రామ సర్పంచ్ తాటిపర్తి వనజ గారు. సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలో గోపాల్ నగర్ ప్రాంత వాసులకు మంచినీరు గ్రామపంచాయతీ కుళాయిల ద్వారా నీరు అందడం లేదని ప్రజల పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా ప్రయోజనం లేదు అని, గోపాల్ నగర్ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తపరిచారు. జలజీవన్ మిషన్ పథకం క్రింద కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రజలకు మంచినీరు ఇవ్వలేక ఇటు అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనది. సింగరాయకొండ గ్రామపంచాయతీ సర్పంచ్ గారిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో రెండో స్థానంలో గెలిపించిన గోపాల్ నగర ప్రాంత వాసులకు ఇచ్చిన బహుమానం, నీరు రాకుండా చేయడం అని, ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తపరిచినారు. ఈ విషయాన్ని ఎంపీడీవో గారికి తెలియజేయగా వెంటనే సమస్యను పరిష్కరించి గోపాల్ నగర ప్రజలకు నీరు అందిస్తామని, జనసేన పార్టీ నాయకులకు, ప్రజలకు హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, అధికార ప్రతినిధి సంకే నాగరాజు, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, కార్యదర్శులు అనుమల శెట్టి నాగరాజు, గుంటుపల్లి శ్రీనివాస్, సిహెచ్ శివ, జన సైనికులు, వీరమహిళలు మరియు గోపాల్ నగర్ ప్రజలు పాల్గొన్నారు.