టిడ్కో ఇల్లు, జగనన్న కాలనిల భాదితుల తరుపున సర్వేపల్లి జనసేన గళం..

సర్వేపల్లి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు శనివారం జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమంలో బాగంగా ముత్తుకూరు మండలంలోని జగనన్న ఇళ్ళని పరిశీలించడం జరిగింది.

#jaganannamosam మాట తప్పని మడమతిప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు నవరత్నాలలో భాగంగా ఈ రాష్ట్రంలో పేదవాళ్లకి 28 లక్షల 30 వేల మందికి ఇళ్ళు నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చి, తోలి విడత 1863552 ఇల్లు 2022 జూన్ నాటికి పూర్తిగా నిర్మించి ఇస్తామని చెప్పి ఆమె ఇచ్చారు. అయితే ఎప్పటికీ ఐదు నెలలు పూర్తి అయినా గాని 50 శాతం కూడా ఇల్లు పూర్తి చేసి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా కూడా 68, 677 ఎకరాల భూమిని పది రూపాయల నుంచి 20 లక్షలు విలువ గలిగిన భూమిని 70 లక్షల నుంచి ఒక కోటి రూపాయలు వరకు రేటు పెట్టి కొనుగోలు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తా ఉంది. ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా కూడా తెలియాలి పేదలకు న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా జనసేన పార్టీ నాయకులు జనసైనికులు అందరూ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ యొక్క జగనన్న ఇళ్లు పేదవాడి కన్నీళ్లు అనే నినాదంతో పేదవాడు కన్నీళ్లు తుడిచెందుకు జనసేన పార్టీ అడుగు ముందుకి వేయడం జరిగింది.

సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలంలో శనివారం పేదలకు ఇచ్చిన జగనన్న ప్లాట్లను పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా కనీసం అర్హులైన వారికి ఇల్లు ఇవ్వక పొగా.. ఇచ్చిన అరకురా కూడా పూర్తిస్థాయిలో నిర్మాణం జరగలేదు. కొంతమంది అనర్హులకి ఇవ్వడంతో వాళ్లు అమ్ముకునే పరిస్థితి మనం గమనించవచ్చు. అర్హులు అయినటువంటి వాళ్ళు నిర్మించుకునే శక్తి లేని పరిస్థితులు మనం చూడవచ్చు.
ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల అధ్యక్షుడు గణపతి, రహీం భాయ్, వెంకటేశ్వర్లు, పవన్, శ్రీహరి, రహమాన్, గిరీష్, తదితరులు పాల్గొన్నారు.