సర్వేపల్లి జనసేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు

సర్వేపల్లి, సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సర్వేపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు నేతృత్వంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే సమాజసేవ, మహిళా విద్యావంతురాలిగా, ఉపాధ్యాయునిగా, సంఘసంస్కర్తగా చేసిన సేవలను గుర్తు చేసుకొని, నేటి మహిళలు, యువతులు, బాలికలు సమాజానికి ఉపయోగపడే విధంగా కలిసికట్టుగా ముందుకు నడచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు. సావిత్రిబాయి పూలే చరిత్రను నేటి యువతకు అర్థమయ్యేలా పరిచయం చేయడం మనందరి బాధ్యత అని, ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి గుర్తుచేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గమ్మినేని వాణి భవాని నాయుడు, నారదాసు రవి, మండల ప్రధాన కార్యదర్శి కాకి శివకుమార్, సందూరి శ్రీహరి, కంటే సుధాకర్, మణి, అశోక్, మస్తాన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment