పెంచిన విద్యుత్ చార్జీలకు సర్వేపల్లి జనసేన నిరసన

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తానని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టి ఉచితంగా ఇచ్చే విద్యుత్ పక్కన పెట్టు 300 యూనిట్లు దాటితే అమ్మ వడి తీసేస్తానని చెప్పడం మాట తప్పం మడమ తిప్పం అనే దానికి నిదర్శనమా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనకుండి నడిపిస్తున్న ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తికి కావాల్సిన ముడుపులు ఇచ్చే దానికోసం పథకాలు రూపంలో సామాన్య పేద ప్రజల పై పన్నుల భారం మోపి ముడుపులు అందిస్తున్నారా..? మీ స్వార్థ రాజకీయాల కోసం పేదవాడి జీవితాలతో ఆడుకుంటార ఇంకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి అదేవిధంగా 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పి మాట మార్చిన రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని ఆదివారం జనసేన పార్టీ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు సంజు రాకేష్, వంశీకృష్ణ, కార్తీక్, శశి, సందీప్, శ్రీహరి, రెహమాన్, వంశీ తదితరులు పాల్గొన్నారు.