సర్వేపల్లి విద్యామిత్ర కిట్లు పంపిణి

చండ్రగూడెం: కొత్తచండ్రగూడెం గ్రామంలోని ఎం.పీ.పీ.ఎస్ స్కూల్ లోని పిల్లలకు సర్వేపల్లి విద్యామిత్ర కిట్లు పంపిణి కార్యక్రమంలో మైలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పొనకళ్ల నవ్యశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవ్యశ్రీ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గవర్నమెంట్ పాఠశాలలు ఫలితాలు సాధిస్తున్నాయని! ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరింత మెరుగైన విద్యను అందించే విధంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ కృషి చేస్తున్నారని అభినందించారు. సర్వేపల్లి విద్యామిత్ర కార్యక్రమానికి సర్వేపల్లి రాధాకృష్ణ పేరును పెట్టడం ద్వారా రాజకీయాలకు అతీతంగా దేశనాయకులను గౌరవించే విధంగా ఈ కార్యక్రమం ఉందని పేర్కొన్నారు.గవర్నమెంట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో బోధించడం ద్వారా పిల్లల్లో మెరుగైన ఆలోచనలు కలుగజేసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, జనసేనపార్టీ చండ్రగూడెం గ్రామఅధ్యక్షులు ఏ.శివరాం ప్రసాద్, జనసైనికులు పెద్దారపు శ్రీ సాయి కృష్ణ, శీలం చందు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-06-16-at-7.03.55-PM-1-768x1024 సర్వేపల్లి విద్యామిత్ర కిట్లు పంపిణి

Share this content:

Post Comment