సత్తెమ్మ తల్లి తిరుణాల మహోత్సవం

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో వేంచేసి ఉన్న సత్తెమ్మ తల్లి తిరుణాల మహోత్సవంలో చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మాధవరావు ఆత్మీయ ఆహ్వానంతో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మరియు నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి. తిరుణాల మహోత్సవంలో చివరి రోజు అయిన పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఉదయభాను మరియు రమాదేవి ప్రారంభించారు. తదనంతరం ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమాలను నిర్వహించి, ఎన్టిఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మరియు నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవిని వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ ఎన్నో వందల సంవత్సరాల నుండి అంబారుపేట గ్రామంలో వేంచేసి ఉన్న సత్యమ్మ తల్లి ఆలయ ప్రతిష్టలో భాగంగా తిరునాళ్ళు మహోత్సవాలు జరిపే కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని తెలిపారు. తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ సనాతన ధర్మ నిర్మాణానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రతి కార్యకర్త కూడా తన వంతు కృషిగా ముందుండి ఆయా ప్రాంతాల్లో దేవాలయాల ప్రతిష్టను పెంచే విధంగా కార్యక్రమాలు జరుపుతూ ఉంటారని తెలియజేశారు. అందులో భాగంగానే కొన్ని వందల సంవత్సరాల నుండి నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో వేంచేసి ఉన్న సత్తెమ్మ తల్లి తిరుణాల మహోత్సవంలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని అందులో చివరి రోజైనా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అని తెలియజేసిన నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, తంబళ్లపల్లి రమాదేవి మరియు ఎన్టీఆర్ జిల్లా జనసేన నాయకులు గుడివాడ సాంబశివరావు, ఎర్రబడి సురేష్, జనసైనికులు వీర మహిళలు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment