ఇచ్చాపురం గణతంత్ర వేడుకల్లో గర్భాన సత్తిబాబు

ఇచ్చాపురం, గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గం తులసిగాం పంచాయితీ ఇన్నేసుపేట గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ అల్లూరి సీతారామరాజు మరియు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహ ఆవిష్కరణలో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు
గర్భన సత్తిబాబు మాట్లాడుతూ… మీ రక్తాన్ని ఇవ్వండి స్వాతంత్ర్యన్ని తీసుకొస్తా అని చెప్పిన శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాటలు గుర్తు చేస్తూ…
జనసేన పార్టీ కోసం మీ తల్లిదండ్రులతో ఓట్లు వేయించండి పవన్ కళ్యాణ్ ని సీఎం చేయండి. అభివృద్ధి అన్నది ఏమిటో చూపిస్తారని ఈ సందర్భంగా చెబుతూ గ్రామ ప్రజలకు జనసైనికులకు, జనసేన పార్టీ నాయకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.