సరస్వతి శిశు మందిర్ లో అదనపు తరగతి గదులను ప్రారంభించిన మేడిచర్ల సత్యవాణి

గ్రామీణ విద్యార్దిని విద్యార్దులకు మార్గదర్శకాలు సరస్వతి శిశుమందిరాలు జనసేన మలికిపురం ఎంపీపీ శ్రీమతి మేడిచర్ల సత్యవాణి రాము

రాజోలు, మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో ఉన్నటువంటి సరస్వతి శిశు మందిరంలో అదనపు తరగతి గదులు ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు కృషి చేస్తున్న సరస్వతి శిశు మందిర్ సిబ్బందిని, యాజమాన్యాన్ని అభినందించారు, విద్యార్థులు విద్యా అవకాశాలను మంచిగా ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆమె సూచించారు విద్యావ్యవస్థల పురద్దురణకు ప్రభుత్వం తరుపున కూడా సహాయసహకారాలు అందించాలని ఆమె నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు బోనం సాయి, మేడిచర్ల రాము తదితరులు పాల్గొన్నారు.