బూడిద నుంచి స్థానిక ప్రజలను రక్షించండి: జనసేన పార్టీ

మైలవరం నియోజకవర్గం: వి.టి.పి.యస్ నుండి వెలువడే కాలుష్యంపై మరియు ఇతర సమస్యలపై చీఫ్ ఇంజనీర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. వినతి పత్రంలో ప్రధాన అంశాలుగా అడ్డగోలుగా నిర్వహిస్తున్న బూడిద మిషన్లపై చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించిన లోడింగ్లను అరికట్టాలని, స్థానిక లారీ యజమానులకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు. అంతేకాకుండా కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని విరివిగా కాలుష్య ప్రభావిత ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, నూతన యూనిట్లో స్థానికులకు ఉద్యోగ ప్రాధాన్యత ఇవ్వాలని, గత 5 సంవత్సరాలనుండి సంవత్సరాలలో 15 కోట్లు రూపాయలు రావాల్సిన సి.ఎస్.ఆర్ నిధులను తక్షణమే మంజూరు చేసి ఆ నిధులతో మొట్టమొదట హామీగా తుమ్మలపాలెం గ్రామంలోని రెండు కెనల్ వంతులను నిర్మించాలని బి కాలనీ లో నూతన ఆడిటోరియం నిర్మించాలని కోరారు. దీనిపై స్పందించిన చీఫ్ ఇంజనీర్ గారు త్వరలోనే మీరు చెప్పిన అంశాలపై దృష్టి పెడతామని హామీఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, కొండపల్లి జనసేన పార్టీ మున్సిపల్ నాయకులు ఎర్రం శెట్టి నాని, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు మరియు ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ మరియు జనసేన నాయకులు పార్థసారథి, సుజాత, హరీష్, రామాంజనేయులు, బాల పాల్గొనడం జరిగింది.