ఎయిమ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

విజయనగరం: ఎయిమ్ (అంబేద్కర్ ఇండియా మిషన్) ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా ఎయిమ్ కన్వీనర్ కెల్ల భీమారావు అధ్యక్షతన గుర్ల మండలం గుర్ల జడ్పీ హెచ్ హైస్కూల్ లో చదువుల తల్లి, సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అధితిగా విచ్చేసిన గుర్ల ఎంపీడీఓ కళ్యాణి మాట్లాడుతూ సావిత్రి భాయి ఫూలే ఆశయాలు తో ముందుకు సాగాలని విద్యార్థులను కోరారు. మహానుభావులు చరిత్ర తెలుసుకొని మంచిగా నడవాలన్నారు. సభా అధ్యక్షులు జిల్లాఎయిమ్ కన్వీనర్ కెల్ల భీమారావు మాట్లాడు తూ మహాత్మా జ్యోతి రావు ఫూలే, సావిత్రి భాయి ఫూలే పుట్టక పోయి ఉంటే బడుగు బలహీన వర్గాలు ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్రంగా నష్ట పోయే వారన్నారు వారి స్ఫూర్తి తోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంను వ్రాసారు అన్నారు. అందరు చదవాలని, మూఢ నమ్మకాలపై ఉద్యమం మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి భాయి ఫూలే దంపతులు కృషి వలన, ఈనాడు బీసీ. ఎస్సీ. ఎస్టీ.మైనార్టీ పేద వర్గ ప్రజలు అభివృద్ధి చెందుతున్నారంటే వారి చలవే అన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎయిమ్ ఆధ్వర్యంలో టీచర్ కి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుర్ల ఎం ఇ ఓ.భానుప్రకాష్ గుర్ల జడ్పీ హెచ్ హై స్కూల్ హెచ్ ఎం ఉమామహేశ్వరావు వెలుగు ఏపీఎం పి.నారాయణ రావు, గుర్ల సర్పంచ్ ఇజ్జిరోతు ప్రసాద్, గుర్ల ఎయిమ్ కన్వీనర్ తలే నారాయణ అప్పడుగ, హైస్కూల్ ఇంచార్జి రాజాన ప్రసాద్ గుర్ల మండలం ఎయిమ్ సైనిక్ కన్వీనర్ పొట్నూరు రామన్న జన విజ్ఞాన వేదిక నాయకులు దాసరి ఈశ్వరరావు, లండ ఈశ్వరరావు, గుర్ల ఎయిమ్ నాయకులు గిడిజాల జనార్దన్, గంధవరపు రాజేష్, ఒమ్మి వినయ్, ఉపాధ్యాయులు, విద్యార్ధినులు తదితరులు పాల్గొన్నారు.