కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కె పి హెచ్ బి కాలనీ 5వ ఫేజ్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రీబాయి ఫూలే వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ, “సావిత్రీబాయి ఫూలే తన జీవితాన్ని మహిళా హక్కులు, విద్యా ప్రాచుర్యం కోసం అంకితం చేసి, బాల్యవివాహాలు, సతీ, కుల వివక్ష వంటి అనేక సామాజిక దురాచారాలపై పోరాటం చేశారు. ఆమె ఒక గొప్ప సంఘ సంస్కర్త, విద్యావేత్త, మానవతావాది, సమృద్ధి కలిగిన మరాఠీ రచయిత్రి” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యనిర్వాహక జనరల్ సెక్రటరీ మండలి దయాకర్, నియోజకవర్గ నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, కలిగినీడి ప్రసాద్, సత్యసాయి, పోలెబోయిన శ్రీనివాస్, మారుతి, గోపీ, హనుమ, బాలాజీ, పులగం సుబ్బు, సిద్ధు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment