మదనపల్లెలో జనసేనాని జన్మదినోత్సవ వేడుకల షెడ్యూల్
మదనపల్లె నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల షెడ్యూల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. సెప్టెంబర్ 1వ తేదీ శుక్రవారం మదనపల్లె ఇండస్ట్రియల్ ఏరియా డి-మార్ట్ తూర్పువైపున ఉన్న వికలాంగుల కాలనీ మెయిన్ రోడ్డులో ఉదయం 9.30 గంటల నుండి ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు ఆపై మరియు ఉచిత కంటి అద్దాలు అందించడం మరియు అత్యున్నత డాక్టర్ల పర్యవేక్షణలో నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్ల ఏర్పాటు, అనంతరం మధ్యాహ్నం 12.30 గం.లకు సాయిచిత్ర సినిమా హాలు దగ్గర చైతన్య అనాధ ఆశ్రమంలో నూతన వస్త్రములు పంపిణి కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబర్ 2వ తేదీ శనివారం నీరుగట్టువారిపల్లె మెయిన్ రోడ్డు మాయాబజార్ క్రాస్ కి ఇవతల ఉదయం 10.00 గంటలకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబడును. అనంతరం ఆంజనేయస్వామి గుడి దగ్గర, కట్లాటపల్లి రోడ్, నీరుగట్టువారిపల్లెలో మధ్యాహ్నం 12.00 గంటల నుండి భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనము చేయడము. అనంతరం సాయంత్రం 4.00 గంటల నుండి నక్కలదిన్నే లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ లో నోటు బుక్స్, పెన్నులు పంపిణి కార్యక్రమం నిర్వహించబడును అని మదనపల్లెలో జనసేనాని జన్మదినోత్సవ వేడుకల షెడ్యూల్ ను గంగారపు రాందాస్ చౌదరి పి.ఆర్.ఓ విడుదలచేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-01-at-2.24.15-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-01-at-2.24.16-PM-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-01-at-2.24.53-PM-1024x580.jpeg)