నాగబాబు నెల్లూరు జిల్లా పర్యటన, సమీక్ష సమావేశాల షెడ్యూల్

నెల్లూరు: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు డిసెంబర్ 16,17న ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటన నేపధ్యంలో సమీక్ష సమావేశాల షెడ్యూల్ నిమిత్తం జనసేన నాయకులు కస్తూర్బా గ్రౌండ్స్ నందు గల రవీంద్రనాథ్ ఠాగూర్ ఫంక్షన్ హాల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా ప్రియతమ నాయకుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి యువత మద్దతు దారుల రథసారథి కొణిదల నాగబాబు ఈ నెల 16 17 తేదీన స్థానిక కస్తూర్బా గ్రౌండ్స్ నందు గల రవీంద్ర భారతి ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. జనసైనికులు చిరంజీవి యువత, మెగా మద్దదారులు కోరిక పై మొదటిగా ఎన్నికలు సమీపిస్తున్న వేల మాటిచ్చిన పకారం మొదటగా నెల్లూరు జిల్లా నుంచే నాగబాబు గారు సమీక్ష సమావేశాలు నిర్వహించడం సంతోషదాయకం. ఈ తేదీల్లో పది నియోజకవర్గాలకు విడివిడిగా సమీక్ష సమావేశం నిర్వహించబడతాయి. గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి చేయని జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు, రానున్న 100 రోజుల్లో సార్వత్రిక ఉన్న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జనసైనికులు చిరంజీవి యువత మద్దతుదారులు కలిసికట్టుగా ఒకత్రాటి పైకి వచ్చి ఏ విధంగా పనిచేసే పార్టీని ముందుకు తీసుకెళ్లాలని విధంగా దిశా నిర్దేశం చేస్తూ సాగే ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు,మెగా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేర్కొన్నారు. మరో వంద రోజుల్లో ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం మొదటిగా నెల్లూరు నుంచి సమీక్ష సమావేశాలు ప్రారంభిస్తూ నెల్లూరుకి విచ్చేస్తున్న నాగబాబు గారికి జనసేన ఇన్చార్జిలు, కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, వీరమహిళలు, మద్దతుదారులు, కాపు సంక్షేమ సేన నాయకులు, సభ్యులు, చిరంజీవి యువత కమిటీ సభ్యులు, మెగా మద్దతు దారులు, జనసేన పార్టీ మద్దతు దారులు పాల్గొని ఘన స్వాగతం పలికి కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మనవి చేసారు. అనంతరం జరగబోయే కార్యక్రమం షెడ్యూల్ వివరాలు క్రింది విధంగా తెలిపారు. వేదిక: రవీంద్రనాథ్ ఫంక్షన్ హాల్, కస్తూరిబాయ్ కళాక్షేత్రం గ్రౌండ్స్, దర్గా మిట్ట, నెల్లూరు. 16 12 2023 శనివారం, ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల సమీక్ష సమావేశం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి కావలి, ఆత్మకూరు, ఉదయగిరి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం. 17 12 2023 ఉదయం 10 నిమిషాలకు. నెల్లూరు సిటీ, కోవూరు, సుళ్ళూరు పేట నియేజక వర్గాల సమీక్ష సమావేశాలు జరుగును. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏటూరి రవి, జనసేన అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, కోవూరు కేర్ సెంటర్ గుడి హరి రెడ్డి, ఆత్మకూరు ఇన్చార్జి నళిశెట్టి శ్రీధర్, సుళ్ళూరు పేట ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్, నగర కార్యదర్శి ఏ ఆర్ రెహమాన్, జిల్లా ఉపాధ్యక్షులు బద్దిపూడి సుదీర్, నాగరత్నం యాదవ్, హైమావతి, రేణుక, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు సుధా మాధవ్,జిల్లా ప్రధాన కార్యదర్శి సందీప్, గంగిశెట్టి నరసింహ, ప్రశాంత్ గౌడ్, కేశవ, హేమచంద్ర యాదవ్, ఖలీల్, శరవణ తదితరులు పాల్గొన్నారు.