పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించిన ఆప్తా

తిరుపతి రూరల్, తిరుచనూరు సంస్కృత్తి జూనియర్ కాలేజీ నందు, ఆప్తా అమెరికన్ ప్రోగ్రెస్సివ్ తెలుగు అసోసియేషన్ ద్వారా తిరుపతి జిల్లాలోని పేద బలిజ విద్యార్థులకు 35 మందికి స్కాలర్షిప్ సుమారు రూపాయలు 560000/- విలువ గల చెక్ లను ఆదివారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి, మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొ.భారతి, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీ.జీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. నారాయణమ్మ, ఎస్.వి అగ్రికల్చరల్ యూనివర్సిటీ రెటైర్డ్ డీన్ హరిబాబు, భోత్ హాస్పిటల్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, కొట్టే రాజగోపాల్, పద్మావతి విద్యాసంస్థల ఛైర్మెన్ సులోచనమ్మ, ఆర్.యు.ఎస్.ఏ చైర్పర్సన్ వంశీలు ముఖ్య అతిధులుగా పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని డా.మురళి కొణిదిన, శ్రీనివాసులు అరిగెల, మెండ్రి చిరంజీవి, తోట మధు, రెడ్డి బాబు, కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.