ఏపీ గవర్నర్‌తో ఎస్ఈసీ సమావేశం..

గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశం ముగిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు.. తాజా పరిణామాలపై గవర్కర్‌కు వివరించారు రమేష్ కుమార్. స్థానిక సంస్థలక సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చాననే విషయాన్ని గవర్నర్ దృష్టికి ఎస్ఈసీ తీసుకెళ్లారు. హైకోర్టులో జరిగిన పరిణామాలు.. తీర్పుపై అప్పీల్ చేసిన విషయాలను గవర్నర్‌కు వివరించారు.

అర్ధగంట పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశం సాగింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీలోని ఉద్యోగులను ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని గవర్నర్‌కు నిమ్మగడ్డ వివరించారు. తాజాగా ఎస్‌ఈసీ జాయింట్ డైరెక్టర్ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లిన విషయాన్ని సైతం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఉద్యోగులను ఎస్‌ఈసీకి సహకరించకుండా పరోక్షంగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందంటూ పిర్యాదు చేసినట్లు సమాచారం. వివిధ ఉద్యోగి సంఘాలు బహిరంగంగానే సహకరించేది లేదంటూ మీడియా సమావేశాలు పెట్టిన విషయాన్ని సైతం ఎస్‌ఈసీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.