సెకండ్ డోస్ వ్యాక్సిన్ కు ప్రాధాన్యతను ఇవ్వాలి: జగన్

సరైన సమయంలో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఇవ్వకపోతే టీకా వృథా అయిపోతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ మాత్రమే పరిష్కారమని చెప్పారు. వ్యాక్సినేషన్ కు సంబంధించి మనం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ 90 శాతం పూర్తయితేనే.. మిగిలిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి సారించాలని సూచించారు. వివిధ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైమేరకు సూచనలు చేశారు.

ప్రతి నెల మొదటి శుక్రవారం ఆర్బీకే స్థాయిలో, రెండో శుక్రవారం మండల స్థాయిలో, మూడో శుక్రవారం జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలను నిర్వహించాలని జగన్ సూచించారు. ఈ నెల 9 నుంచి 23వ తేదీ వరకు రైతు భరోసా చైతన్య యాత్రలను నిర్వహించాలని అన్నారు. సీఎం యాప్ పనితీరు, ఆర్బీకేల విధివిధానాలు, ఈక్రాపింగ్ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు.