జనసేనానికి సెక్యూరిటీ కల్పించాలి.. శీలం బ్రహ్మయ్య

మైలవరం: స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి తూర్పుగోదావరి వారాహి యాత్ర పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమని, గతంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్, వర్గాలు పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీ అవసరమని, ఆయనపై కుట్ర జరుగుతుందని, తెలియజేశారని గుర్తు చేశారు. సుఫారీలు తీసుకొని వీధి రౌడీలతోనూ, గుండాల తోనూ, పవన్ కళ్యాణ్ ను హతమార్చాలని, కుట్ర పన్నిన లేదా దాడి చేయాలని ప్రయత్నించిన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసైనికులు, వీరమహిళలు, అశేషంగా ఉన్న అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కి ఏమి జరిగినా?.. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని కాబట్టి, ఈ రాష్ట్ర డిజిపి వెంటనే పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీ కల్పించాలని, వారాహి యాత్రను సజావుగా సాగే లాగా సహకరించాలని డిమాండ్ చేశారు. పొలిటికల్ బుర్రకథ కళాకారులు పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరని, నిజాయితీగల నాయకుడు కాబట్టే పవన్ కళ్యాణ్ పైన కుట్రలు పన్నుతున్నరని, వారికి ప్రజలే సమాధానం ఇస్తారని తెలియజేశారు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.