జనసేన నాయకుల ఆధ్వర్యంలో పాకాల మండల కమిటీ ఎంపిక ప్రక్రియ

చిత్తూరు, జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి, జిల్లా కార్యదర్శులు దేవర మనోహర్, ఎం.నాసీర్ పర్యవేక్షణలో మండల అధ్యక్షులు గురునాథ్ తలారి సమక్షంలో చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండల కమిటీ ఎంపిక ప్రక్రియ జరిగినది.ఇందులో భాగంగా మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క జనసైనికుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజవర్గ నాయకులు, మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొనటం జరిగింది.