ఆత్మకూరు, ఇటీవల ఆత్మకూరు మండలం గండ్లవీడు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన భవన నిర్మాణ కార్మికుడు షేక్ ఖాదర్ మస్తాన్ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున మానవీయ మద్దతు అందించారు. రోజువారి ఆదాయం కోల్పోయిన ఆయన కుటుంబానికి నెలపాటు సరిపడే నిత్యావసర సరుకులు, పిల్లల కోసం స్నాక్స్‌ను అందించారు. ఈ సేవా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత గౌరవ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆశీస్సులతో, జనసేన ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు, ఐటి కోఆర్డినేటర్ పులిపాటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో, సీనియర్ నాయకులు పసుపులేటి శ్రీరామ్ పర్యవేక్షణలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా షేక్ ఖాదర్ మస్తాన్ కుటుంబానికి మద్దతు ప్రకటించిన జనసేన నాయకులు, “ఈ కుటుంబానికి అవసరమైన ప్రభుత్వ పథకాలు అందేలా, ముఖ్యంగా పెన్షన్ వచ్చేలా పూర్తి సహకారం అందిస్తాం,” అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ పేట మండల అధ్యక్షుడు సయ్యద్ అక్బర్ భాష, గడ్డం వంశీ కృష్ణ (ఆత్మకూరు టౌన్ నాయకుడు), సైఫ్ ఉద్దీన్, వినోద్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ మానవీయ కార్యక్రమం జనసేన పార్టీ ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను చాటిచెప్పిందని స్థానిక ప్రజలు అభినందించారు.
Share this content:
Post Comment