మంగళగిరి జనసేన ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దైవజనులు ప్రేమ్ కుమార్ ప్రార్థన చేస్తూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని నియోజకవర్గ ఇన్చార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళగిరి ప్రజలకు మంచి పాలన అందించాలని సెమీ క్రిస్మస్ సందర్భంగా ఆ ప్రభువుని ప్రార్థించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముందుగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు ఎలా అయితే పవిత్రమైన దారిలో అడుగుజాడల్లో సమాజాన్ని నడిపేటట్టు చేశారో, మనల్ని కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో పవిత్రమైన సందేశాన్ని ఇస్తూ జనసేన పార్టీ ద్వారా ప్రజలకు చేరువ అయ్యేలాగా కృషి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెబుతూ ఉంటారు, తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడును అని మనమందరం తోడై పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవిధంగా మనమందరం కలిసికట్టుగా కృషిచేసి అలాగే ఈ క్రిస్మస్ సందర్భంగా ఏసుక్రీస్తుని ప్రార్థించుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్, ఎం.టి.ఎం.సి అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్), ఎం.టి.ఎం.సి ఉపాధ్యక్షులు షేక్ ఖైరుల్లా, ఎం.టి.ఎం.సి కార్యదర్శి ఖ్.చంద్రశేఖర్, సీనియర్ నాయకులు నారాయణ, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు (ఎస్.ఎన్.ఆర్), దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు జోసఫ్ తంబి, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు నాగభూషణం, బత్తినేని అంజయ్య, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు సుందరయ్య, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండల కమిటీ సభ్యులు, మంగళగిరి నియోజకవర్గం జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, చిల్లపల్లి యూత్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.