పంతం నానాజీ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ సీనియర్ నాయకులు

కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సర్పవరం గ్రామానికీ చెందిన వైసీపీ ముఖ్యులు, పెద్దలు, మాజీ బ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ దినవాయి పేర్రాజు (పేరు బాబు) మరియు మాజీ డి సీ ఎం ఎస్ వైస్ చైర్మన్ మానేపల్లి బాబ్జీ వారి అనుచర గణంతో ఆ పార్టీకి రాజీనామాలు చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపి & బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు (నానాజీ) సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నానాజీ జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు లేకుండా వారిని అగౌరవ పరిచారు. వారు వారి సమాజిక వర్గాలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడంలో విఫలమయ్యారని తెలిపారు. పేరుకే కార్పొరేషన్ చెర్మన్లును నియమించారని మండిపడ్డారు.