హెచ్.ఐ.వి బాధితులకు బాసటగా సెన్జేస్ విహాన్ సంస్థ

అమలాపురం, డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శనివారం అమలాపురం పట్టణం విద్యుత్ నగర్ లో సేన్జేస్ విహాన్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని హీవ్ బారిన పడిన చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్ కిట్లను(సుమారు 50 మందికి) అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెన్జేస్ విహాన్ సంస్థ సభ్యులు మరియు హెచ్.ఐ.వి బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.